HomeTelugu Trending‘A’ టీజర్.. వైరల్‌

‘A’ టీజర్.. వైరల్‌

8 4
నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరో, హీరోయిన్‌లుగా యుగంధర్ ముని డైరెక్షన్‌లో వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ఏ (ఏ డి ఇన్ఫినిటమ్)’. అవంతిక ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాని నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ రిలీజ్‌ చేశారు.

సంతోషంగా ఉన్న ఓ కుటుంబంలో పాప కనపడకపోవడం ఆందోళ‌న క‌లిగిస్తుంది. పాపను ఎవ‌రు కిడ్నాప్ చేశారు, ఎలా మిస్ అయింది అనే విష‌యాల‌పై టీజ‌ర్ ద్వారా స‌స్పెన్స్‌ని క‌లిగించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే సినీ ప్రేక్షకులు ఈ టీజర్‌ను తెగ లైక్‌ చేస్తున్నారు. అద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ చిత్రానికి విజయ్‌ కురాకుల సంగీతాన్ని అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu