ఆ రీమేక్ నాగ్ దగ్గరకు వెళ్లిందట!

ఈ మధ్య కాలంలో కోలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన చిత్రం ‘విక్రమ్ వేద’. పుష్కర్, గాయత్రి కలిసి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించగా, మాధవన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. వీరిద్దరి కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో వెంకటేష్, రానా కలిసి నటిస్తారనే మాటలు వినిపించాయి. అయితే ఈ సినిమా తమిళ నిర్మాతలు తెలుగు రీమేక్ కోసం నటుడు నాగార్జునను సంప్రదించినట్లుగా సమాచారం.
తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన గ్యాంగ్ స్టర్ పాత్రలో నాగార్జునను నటించమని అడిగారట. పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం మాధవన్ ను రిపీట్ చేయాలని అనుకుంటున్నారు. నాగార్జున-మాధవన్ వంటి ఇద్దరు క్రేజీ హీరోల కాంబినేషన్ లో తెలుగు రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే ‘ఊపిరి’ సినిమా తరువాత నాగార్జున కెరీర్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ గా ఈ సినిమా పేరు తెచ్చుకోవడం ఖాయం. డార్క్ విజువల్స్, కల్ట్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మంచి పేరు తీసుకొచ్చింది. మరి ఈ కథకు ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించకుండా, నాగార్జున నటించడానికి అంగీకరిస్తాడా..? లేదా..? అనే విషయంపై కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.