HomeTelugu Big Storiesవర్మ నగ్నం ట్రైలర్.. మరీ ఇంత అరాచకమా?

వర్మ నగ్నం ట్రైలర్.. మరీ ఇంత అరాచకమా?

10 5

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరాచకం రోజు రోజుకూ పెరిగిపోతోంది. లాక్ డౌన్‌లో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే నగ్న చిత్రాన్ని రూపొందించి ‘ఆర్జీవీ వరల్డ్’ ద్వారా ఆన్ లైన్‌లో విడుదల చేసి కాసులు కురిపించుకున్న వర్మ.. తాజాగా ‘నగ్నం’ (NAKED) అనే పేరుతో మరో నగ్న చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశాడు.నేనేం రాజమౌళిని కాదు.. ఇది ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా కాదు.. చెప్పిన సమయానికే తప్పకుండా విడుదల చేస్తానన్న ట్రైలర్‌ను రిలీజ్ చేశాను అన్నట్టుగా ఈ ‘నగ్నం’ వీడియోను సోమవారం సాయంత్రం విడుదల చేశాడు. అయితే నిమిషంన్నర నిడివి గల ఈ ‘నగ్నం’ ట్రైలర్ లో వర్మ ఫోకస్ మొత్తం ఆమె శరీర భాగాలపైనే పెట్టాడు. ముఖ్యంగా కెమెరాను రకరకాల యాంగిల్స్‌లో పెట్టి ఆమెను న్యూడ్‌గా చూపించాడు. సినిమా పేరుకు తగ్గట్టుగానే ఫోకస్ మొత్తం ఆమె నగ్నత్వంపైనే పెట్టాడు.

నిన్న, మొన్నటి వరకు ఫ్యాక్షన్, హర్రర్ కథలతో ప్రేక్షకులను భయపెట్టిన వర్మ ఆ తర్వాత ఆత్మలు, ఆత్మల కథలతో కొన్నాళ్లు బిజీగా గడిపాడు. ఆ మధ్య పోర్న్‌ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్టీ అంటూ ఓ అడల్ట్‌ మూవీ తీశాడు. ఇప్పుడు లాక్‌డౌన్‌ టైమ్‌లో మియా మాల్కోవాతో ఎడారిలో ఎరోటిక్ మూవీ అంటూ ‘క్లైమాక్స్’ అనే అడల్ట్ మూవీ తీశాడు. క్లైమాక్స్ మూవీ చూసిన నెటిజన్లు ఇక వర్మ కెరీర్ కూడా క్లైమాక్స్‌కు చేరిందని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఆర్జీవీ ఆన్‌లైన్‌లో వంద కట్టి ఓ బూతు సినిమా చూడమంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. ఆర్జీవీకి ఏమైంది బుర్ర పనిచేయక ఇలాంటి పనులు చేస్తున్నాడా? లేక క్రియేటివిటీ తగ్గిపోయి కాంట్రవర్సీలను నమ్ముకున్నాడా..? అసలు సినిమా ఫార్మాట్ మర్చిపోయాడా.. లేక వాటిగురించి ఆలోచించే ఓపిక లేదా అని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu