HomeTelugu Trendingవెంకీ కుడుములతో రామ్‌ మూవీ

వెంకీ కుడుములతో రామ్‌ మూవీ

Ram movie with Venky kudumu

టాలీవుడ్‌ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘రెడ్’ సినిమా సంక్రాంతికి విడుదల కావడానికి రెడీ అవుతోంది. అయితే రెడ్ తరువాత రామ్ ఏ సినిమా చేస్తాడని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రెడ్ సినిమా తరువాత రామ్ కొంచెం మాస్ కమర్షియల్ కథ కోసం వెతుకుతున్నాడని టాక్‌. దాంతో రామ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఈ సినిమా పట్టాలెక్కలేదు.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రామ్.. వెంకీ కుడుములతో సినిమా తీయనున్నాడట. అయితే రామ్ తన కొత్త సినిమాను వెంకీ దర్వకత్వంలో చేస్తున్నాడని, దానికి మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ ఇస్తున్నాడని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రామ్‌తో త్రివిక్రమ్ చేద్దామనుకున్న స్క్రిప్టే ఇప్పుడు వెంకీ చేతికి రానుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లేదా సితారా ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించనున్నాయట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu