HomeTelugu Trendingఅభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్న రామ్‌

అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్న రామ్‌

Ram to give a surprise to h
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రామ్. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్‌’ సినిమాలో నటిస్తున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలోనూ రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో రామ్‌ లుక్‌కు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ప్రీక్లైమాక్స్‌లో అభిమానులకు రామ్‌ ఓ సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్నాడట. డిఫరెంట్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకోబోతున్నాడట. ‘రెడ్’ సినిమా కోసం ఓటీటీ సంస్థ రూ.30 కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినా నిర్మాతలు మాత్రం సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలని చూస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu