HomeTelugu Newsనా నెక్ట్స్ సినిమా 'ఆసమ్' గా ఉంటుంది

నా నెక్ట్స్ సినిమా ‘ఆసమ్’ గా ఉంటుంది

యాంగ్రీ హీరో రాజశేఖర్‌ చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తరువాత మరో చిత్రాన్ని చేసేం‍దుకు చాలా సమయం తీసుకున్నాడు. లేకలేక వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకోలేకపోయాడు రాజశేఖర్. ఆ సక్సెస్‌ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చాలా రోజులుగా రాజశేఖర్‌ చేయబోయే సినిమాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

4 26

తాజాగా తాను చేయబోయే సినిమాపై రాజశేఖర్‌ ఓ హింట్‌ ఇచ్చారు. ‘నా నెక్ట్స్ ప్రాజెక్టు గురించి నేను చెప్పగలిగింది ఒక్కటే. ఆ సినిమా ఆసమ్‌ (AWEsome) గా ఉండబోతోంది’ అంటూ తన ట్విటర్‌ పేజ్‌లో కామెంట్‌ చేశారు. దీంతో రాజశేఖర్ తదుపరి చిత్రం అ! (Awe) చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలోనే అన్న క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ, ‘దటీజ్‌ మహాలక్ష్మీ’ తమన్నా లీడ్‌ రోల్‌ తెరకెక్కుతున్న క్వీన్‌ రీమేక్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే రాజశేఖర్‌ సినిమా పనులు ప్రారంభించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu