HomeTelugu Trendingరామ్‌ న్యూపిక్‌ వైరల్‌

రామ్‌ న్యూపిక్‌ వైరల్‌

Ram Pothineni Latest Pic Vi

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా రామ్‌ తన తదుపరి సినిమా తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ప్రకటించాడు. పందెంకోడి, ఆవారా సినిమాలతో ఆకట్టుకున్న లింగుస్వామి ప్రస్తుతం ప్లాప్‌లలో ఉన్నాడు. వీరి కాంబినేషన్ మూవీ బైలింగువల్ సినిమాగా తెలుగు తమిళంలో తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా రామ్ కెరీర్లోనే హై బడ్జెట్ మూవీగా తెరకెక్కనున్నట్లు టాక్ నడుస్తుంది.

మాస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్.. మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తనను తను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నాడు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రామ్‌.. ఇప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా కాఫీ తాగుతూ దిగిన పిక్ పోస్ట్ చేశాడు. బిటర్ కాఫీ కంటే తియ్యనిది ఏది లేదంటూ కాప్షన్ జోడించాడు. చెదిరిన హెయిర్ స్టైల్ తో రామ్ కన్ను గీటిన ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by RAm POthineni (@ram_pothineni)

Recent Articles English

Gallery

Recent Articles Telugu