HomeTelugu Trendingడబుల్‌ ఇస్మార్ట్‌: న్యూ పోస్టర్‌ వైరల్‌

డబుల్‌ ఇస్మార్ట్‌: న్యూ పోస్టర్‌ వైరల్‌

Ram pothineni new look fromరామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్‌’. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాలో రామ్‌ స్టైలిష్‌ గాగుల్స్‌ పెట్టుకొని గన్స్‌ మధ్య స్టైలిష్‌గా ఉన్న డబుల్‌ ఇస్మార్ట్‌ లుక్‌ను విడుదలై ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా రామ్‌ సిక్స్ ప్యాక్ లుక్‌తో చాయ్‌ గ్లాస్ పట్టుకొన్న స్టిల్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

సెట్స్‌లో గుబురు గడ్డంతో ఉన్న హాఫ్ లుక్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సీక్వెల్‌కు కూడా పనిచేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

Image

ఇప్పటికే రామ్‌, పూరీ, మణిశర్మ‌, చార్మీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశాడు‌. డబుల్ ఇస్మార్ట్‌ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌ విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. వంద రోజుల్లో థియేటర్లలో సందడి అంటూ లాంఛ్ చేసిన లుక్‌ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu