‘బంగార్రాజు’లో లావణ్య త్రిపాఠి ఆ పాత్ర కోసమేనా!


టాలీవుడ్‌లో లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. అయితే ఆశించిన స్థాయిలో ఆమె కెరియర్ జోరందుకోలేదు. అలా ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల ‘అర్జున్ సురవరం’ తో హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సందీప్ కిషన్ జోడిగా ఒక సినిమా, కార్తికేయ సరసన ఒక సినిమా చేస్తోంది.

ఇక ‘బంగార్రాజు’ సినిమాలోను ఆమెకి ఛాన్స్ దక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో యంగ్ నాగార్జున సరసన లావణ్య త్రిపాఠి అలరించింది. ఆ సినిమాకి సీక్వెల్ గానే ‘బంగార్రాజు’ రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో.. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో అయితే లావణ్య త్రిపాఠికి అవకాశం లభించింది. హీరోయిన్‌ పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని తీసుకున్నారా? లేదంటే ఎదైన కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారా? అనేది తెలియాల్సి వుంది.