HomeTelugu Reviews'ది వారియర్​' మూవీ రివ్యూ

‘ది వారియర్​’ మూవీ రివ్యూ

The warriorr

ఎనర్జిటిక్ హీరో​ రామ్‌ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ది వారియర్​’. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్​గా కనిపించగా… కృతీశెట్టి హీరోయిన్​గా నటించింది. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వం వహించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్​ చిట్టూరి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో గురువారం (జులై 14) విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్​, ట్రైలర్​కు మంచి స్పందన​ రాగా మొదటిసారిగా రామ్​ పోతినేని తమిళ డైరెక్టర్​తో సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.

కథ: సత్య (రామ్​ పోతినేని) ఓ డాక్టర్. ఎంబీబీఎస్​ పూర్తయ్యాక హౌస్​ సర్జన్​గా వైద్య వృత్తిని ప్రారంభించేందుకు కర్నూలు వెళతాడు. ఒకరి ప్రాణం కాపాడితే తాను మళ్లీ జన్మించినట్లుగా భావించే వ్యక్తితం సత్యది. అలాంటి సత్య ఎదుటే గురు (ఆది పినిశెట్టి) మనుషులు తను కాపాడిన వారి ప్రాణం తీయడాన్ని తట్టుకోలేకపోతాడు. పోలీస్​లకు కంప్లైంట్ చేసిన లాభం ఉండదు. ఇలాంటి సంఘటనలే ఎదురై గురు చేతిలో సత్య చావు దెబ్బలు తింటాడు. గురు నుంచి తప్పించుకున్న సత్య రెండేళ్ల తర్వాత కర్నూల్​కు డీఎస్పీగా వస్తాడు. ఆ తర్వాత సత్య ఏం చేశాడు ? గురును ఎలా ఎదుర్కొన్నాడు ? పోలీసులను ఎలా మార్చాడు ? డాక్టర్​గా చేయలేని ఆపరేషన్​ పోలీస్​గా ఎలా చేశాడు ? అనే తదితర విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సింది.

నటీనటులు : రామ్ పోతినేని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డాక్టర్​గా, పోలీస్​గా, లవర్​గా రామ్​ అదరగొట్టేశాడు. డ్యాన్స్​, యాక్షన్​ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక విలన్​గా ఆది పినిశెట్టి యాక్టింగ్​ ఇరగదీశాడు. రామ్​, ఆది పినిశెట్టి పోటాపోటీగా నటించి అబ్బురపరిచారు. ఆర్జే విజిల్ మహాలక్షిగా కృతీశెట్టి అందంగా నటించింది. సినిమాలో ​ఆమె ప్రజెన్స్ హాయినిస్తుంది. ఇతర నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది.

The warriorr1

విశ్లేషణ: ఒక డాక్టర్​.. పోలీస్​గా మారి రౌడీయిజాన్ని రూపు మాపడం అనే కొత్త కథతో ‘ది వారియర్’ను తెరకెక్కించారు డైరెక్టర్‌ ఎన్​ లింగుస్వామి. డాక్టర్​గా సత్య ఎదుర్కున్న పరిస్థితులను, అక్కడి పోలీసు వ్యవస్థ తీరును, గురు విలనిజాన్ని చూపించడంలో డైరెక్టర్​ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. సినిమాలో విజిల్​ మహాలక్ష్మి (కృతీశెట్టి), సత్య మధ్య వచ్చే లవ్ ట్రాక్​ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే సినిమా మొత్తం ఊహించిన విధంగా, రొటీన్​గా సాగుతుంది. అయితే సినిమా నేపథ్యానికి తగినట్లుగా ఉన్న బీజీఎం, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ చక్కగా ఉన్నాయి.

టైటిల్‌ : ‘ది వారియర్’
నటీనటులు : రామ్​ పోతినేని, ఆది పినిశెట్టి, కృతీశెట్టి, నదియా, అక్షరా గౌడ తదితరులు
దర్శకత్వం:  ఎన్ లింగుస్వామి
నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్​

హైలైట్స్‌‌: హీరో, హీరోయిన్‌ల నటన
డ్రాబ్యాక్స్‌: ఊహించిన విధంగా సాగే కథ

చివరిగా: రొటీన్​గా ‘ది వారియర్​’.
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu