HomeTelugu Trendingహీరో రామ్‌కు గాయాలు వీడియో.. వైరల్‌

హీరో రామ్‌కు గాయాలు వీడియో.. వైరల్‌

6 23

రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్‌ (RED)’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్రవంతి రవికిషోర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్‌లో భాగంగా చిత్రబృందం ప్రముఖ ఫైట్ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ సారథ్యంలో రామ్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇందులో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు రామ్‌ ట్విటర్‌ వేదికగా ఓ స్పెషల్‌ వీడియోను పోస్ట్‌ చేశారు.

‘హాయ్‌ మాస్టర్‌. మీరు కొరియోగ్రాఫ్‌ చేసిన ఫైట్‌ చాలా అద్భుతంగా ఉంది. మీరు నా మీద చూపించే ప్రేమను ఫీల్‌ అవుతున్నాను కానీ చూపించలేకపోతున్నాను. అలాగే మీరు నాకిచ్చి ఈ నొప్పిని కూడా. లవ్‌, #రెడ్‌ఫిల్మ్ #రెడ్‌ ఫైట్‌ ‘ అని రామ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు రామ్‌ పోతినేని. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌కు జంటగా నభా నటేశ్‌, నిధి అగర్వాల్ నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu