HomeTelugu Trendingచంద్రబాబు నాయుడుపై రామ్‌ ట్వీట్‌..వైరల్‌

చంద్రబాబు నాయుడుపై రామ్‌ ట్వీట్‌..వైరల్‌

7 26ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌. మంగళవారం అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల సంస్థలో ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘కొన్నేళ్ల క్రితం అనంతపురం జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తాయంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషితో జిల్లాకు నీటి సరఫరా అందించాం. దీని ద్వారా జిల్లాలో మరెన్నో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు.

దీనిపై రామ్‌ స్పందిస్తూ.. ‘ఇది నిజమే.. మన రాష్ట్రానికి ఇది భారీ ముందడుగు. మున్ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి’ అని పేర్కొన్నారు. రామ్‌ ఈ ట్వీట్‌ చేయగానే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మద్దతు తెలుపుతున్న ఏకైక హీరో రామ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఈ కామెంట్లపై రామ్‌ స్పందిస్తూ.. ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే. ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సల్లేదు. ముందు నేను పౌరుడిని ఆ తర్వాతే నటుడ్ని’ అని వెల్లడించారు రామ్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu