HomeTelugu Trendingసూపర్‌ డూపర్‌ సార్‌: రామ్ ట్వీట్

సూపర్‌ డూపర్‌ సార్‌: రామ్ ట్వీట్

Ram tweeted on lingusamy st

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి రామ్‌-లింగుస్వామి కాంబినేష‌న్ లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రాబోతుంది. రామ్‌కు లింగుస్వామి చెప్పిన స్టోరీ చాలా ఇంప్రెస్ చేసింద‌ట‌. డైరెక్ట‌ర్ లింగుస్వామి హీరో రామ్ కు స్క్రిప్ట్ ను వివరించే ఫైన‌ల్ స్టేజీ పూర్తయింది. ఈ విష‌యాన్ని రామ్ ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

‘‘కథ చెప్పడం పూర్తయింది. లవ్‌ యూ లింగుస్వామి సర్‌. సూపర్‌ డూపర్‌.. నేను చెప్తున్నా.. రోల్‌ కెమెరా’’ అంటూ రామ్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజాగా రామ్‌ కెరీర్‌లో 19వ సినిమాగా తెరకెక్కబోతున్న అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రాబోతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రంలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నారట. యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌గా అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu