HomeTelugu Trending'రామారావు ఆన్‌ డ్యూటీ' ప్రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ప్రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

Ramarao on duty movie Pre R
మాస్‌ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రవితేజను ఆయన ఈ సినిమాలో సబ్ కలెక్టర్ గా చూపించనున్నాడు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశారు. హైదరాబాద్ – ఫిల్మ్ నగర్ .. జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. రవితేజ అభిమానులు ‘వైట్ షర్ట్స్’తో రావాలని ఈ పోస్టర్ ద్వారా చెప్పారు. ఈ సినిమాతో తొట్టెంపూడి వేణు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. నాజర్ .. పవిత్ర లోకేశ్ ఇతర పాత్రలో కనిపించనున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu