HomeTelugu Big Storiesరామ్‌చరణ్-శంకర్ మూవీ స్టార్ట్.. క్లాప్ కొట్టిన చిరంజీవి

రామ్‌చరణ్-శంకర్ మూవీ స్టార్ట్.. క్లాప్ కొట్టిన చిరంజీవి

Ramcharanshanker movie
మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్‌ – డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్‌ స్టార్‌హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఈ వేడుకలో పాల్గొని టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ముహూర్తపు షాట్‌లో భాగంగా చిరంజీవి తన తనయుడు రామ్‌చరణ్‌పై క్లాప్‌ కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. చరణ్‌ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. అంజలి, జయం రవి, శ్రీకాంత్‌, సునీల్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Ramcharanshanker2

Recent Articles English

Gallery

Recent Articles Telugu