ఈ మార్పుతో తేజ సక్సెస్ అందుకుంటాడా..?

కథ, కథనాలకు మాత్రమే విలువనిస్తూ.. కొత్త వారితో సినిమాలు చేసి ఘన విజయాలు అందుకున్న ట్రాక్ రికార్డ్ దర్శకుడు తేజకు ఉంది. కానీ రాను రాను అతడి కథలు మూస ధోరణిలో సాగడంతో ప్రేక్షకులు అతడి సినిమాలకు దూరమయ్యారు. ప్రేమ, హింస కాన్సెప్ట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎప్పుడో దూరం చేసుకున్నాడు. తీసిన సినిమాలనే తిప్పి తిప్పి తీసి రెగ్యులర్ ఆడియన్స్ కూడా తన సినిమాలు చూడడానికి ఆలోచించేలా చేసుకున్నాడు. కానీ రీసెంట్ గా తను డైరెక్ట్ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా టీజర్ చూస్తుంటే తేజలో మార్పు వచ్చినట్లే అనిపిస్తోంది.
తన రెగ్యులర్ కాన్సెప్ట్ ను పక్కన పెట్టి పోలిటికల్ త్రిల్లర్ ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఈసారి తేజ నుండి ఓ కొత్తదనం ఉన్న సినిమాను ఆశించవచ్చు. సురేష్ బాబు కూడా కథలో కంటెంట్ లేకపోతే అసలు పెట్టుబడి పెట్టరు. అలాంటిది తన కొడుకుని తేజ చేతుల్లో పెట్టాడు అంటే ఖచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉందనే అనిపిస్తోంది. మరి టీజర్ లో కనిపించిన కొత్తదనం రేపు సినిమా థియేటర్లలో కూడా చూపించగలిగితే తేజ ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లే!