జైపూర్లో మెగా హీరో సందడి

జైపూర్లో దగ్గుబాటి వారి పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం జైపూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ నుంచి ప్రముఖులంతా హాజరవుతున్నారు. ఇప్పటికే రానా, సమంత, నాగచైతన్య, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లు జైపూర్ చేరుకున్నారు. ఇదిలా ఉంటె, తాజాగా మెగా హీరో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి జైపూర్ బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు జైపూర్ సెలెబ్రిటీల వేడుకలకు అడ్డాగా మారిపోయింది. దీపికా, రణ్‌వీర్‌ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్, ప్రియాంక చోప్రా.. నిక్కీ జోనస్ ల వివాహం, రాజమౌళి కుమారుడి వివాహం, రీసెంట్ గా అంబానీ పిల్లల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జైపూర్ వేదికగా జరిగాయి. ఈ లిస్ట్ లో దగ్గుబాటి కుటుంబం కూడా చేరడం విశేషం.