కేసీఆర్‌కి అభినందనలు తెలిపిన సూపర్ స్టార్

తెలంగాణాలో తిరిగి అధికారం కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ను సూపర్ స్టార్ కృష్ణ అభినందించారు.. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు..నాలుగున్నరేళ్ల పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం..కేసీఆర్‌ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు ఎంతో మేలు చేశాయి.. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండో సారి తెలంగాణకి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతున్న శ్రీ చంద్రశేఖర రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ కృష్ణ తన లేఖలో పేర్కొన్నారు కృష్ణ.