HomeTelugu TrendingRam Charan: గేమ్ ఛేంజర్ తాజా షెడ్యూల్

Ram Charan: గేమ్ ఛేంజర్ తాజా షెడ్యూల్

Ramcharan Game Changer late
Game Changer: టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్‌ తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. స్టార్ డైరక్టర్ శంకర్‌ డైరెక్షలో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

గేమ్‌ ఛేంజర్‌ కొత్త షెడ్యూల్ ప్రస్తుతం కర్నాటకలోని మైసూరులో ప్రారంభమైంది. 12 రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్టు సమాచారం. గేమ్‌ ఛేంజర్‌లో మూవీలో రాంచరణ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్‌ స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న మూవీలో అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu