HomeTelugu Trendingవిశాఖలో రామ్‌చరణ్ మూవీ షూటింగ్

విశాఖలో రామ్‌చరణ్ మూవీ షూటింగ్

Ramcharan latest movie with

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు 4 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం విశాఖపట్టణంలో తాజా షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. విశాఖలో షూటింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా.

ప్రస్తుతం విశాఖ షెడ్యూల్‌లో రామ్‌ చరణ్ కాలేజీకి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొ్న్ని ఫైట్ సీన్స్ కూడా చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇవి సినిమా మొత్తానికే హైలైట్ కానున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్టుగా చెబుతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu