HomeTelugu Trending'సత్యభామ'ను పరిచయం చేసిన నాగర్జున

‘సత్యభామ’ను పరిచయం చేసిన నాగర్జున

Ramya Krishna look from ban

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జంటగా నటిస్తున్నారు. నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సినిమా నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నాగార్జున, రమ్యకృష్ణ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ‘సత్యభామ’గా నటించనుంది. లుక్ అదిరిపోయింది.

ప్రస్తుతం “బంగార్రాజు” షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేస్తూ నాగ చైతన్య కూడా తన తండ్రితో కలిసి కన్పించబోతున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ అంతటా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu