ఏపీ వరద బాధితులకు ప్రభాస్ విరాళం

ఏపీలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా పలు జిల్లాల్లో తీవ్ర నష్టం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. తాజాగా ప్రభాస్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళంగా అందజేశారు.

అంతకుముందు వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు చిరంజీవి, జూ.ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ రూ.25 లక్షల చొప్పున సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. వారంతా వరద బాధిత జిల్లాలు త్వరితగతిన సాధారణ స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

CLICK HERE!! For the aha Latest Updates