HomeTelugu Trendingసలార్‌లో రమ్యకృష్ణ.. పాత్ర ఇదేనట!

సలార్‌లో రమ్యకృష్ణ.. పాత్ర ఇదేనట!

Ramya Krishna in Salaar

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్.. రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో తల్లి కొడుకులుగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తరువాత ప్రభాస్ మరియు రమ్యకృష్ణలు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిసి నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సలార్ సినిమా కోసం రమ్యకృష్ణ ను డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ కీలక పాత్ర కోసం ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి.

సలార్ లో ప్రభాస్‌, రమ్యకృష్ణ అక్క తమ్ముడి గా కనిపించబోతున్నారట. ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని.. అందులో ఒక పాత్రకు రమ్యకృష్ణ అక్క పాత్రను పోషించబోతున్నట్లుగా టాక్‌. బాహుబలి సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. రమ్యకృష్ణ ప్రస్తుతం లైగర్ మరియు రిపబ్లిక్ సినిమాల్లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu