HomeTelugu Trendingఓటీటీలో రిపబ్లిక్‌!

ఓటీటీలో రిపబ్లిక్‌!

Republic movie be released

కరోనా నేపధ్యంలో ఇప్పటిలో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. థియేటర్లకు జనం రావడానికి మరికొంత సమయం పట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో అప్పటివరకూ వేచి చూడలేని సినిమాలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. దీంతో పలు సినిమాలు ఓటీటీ వైపు వెళుతున్నాయి. ఈ సినిమాల జాబితాలో ‘రిపబ్లిక్’ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయనే వినికిడి. సాయితేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి దేవ కట్టా దర్శకత్వ వహిస్తున్నాడు.

నిజానికి ఈ నెల 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అందువలన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ దిశగా చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడవలసిందే. ఈ సినిమాలో జగపతిబాబు .. రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu