జయలలిత పాత్రలో సీనియర్‌ నటి?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవితంపై ఇప్పటికే పలువురు సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. వారిలో భారతాయి రాజా, ఏఎల్ విజయ్, ప్రియదర్శిని వంటి వారుండగా ఇప్పుడు వారి జాబితాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడ చేరారు. ఈయన కూడ జయలలిత జీవితాన్ని తెర మీద ఆవిష్కరించాలని అనుకుంటున్నారు. అయితే అది బుల్లి తెర మీద. ఈయన జయలలిత జీవితాన్ని 30 ఎపిసోడ్స్ ఉండే వెబ్ సిరీస్ గా రూపొందించనున్నారట. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ జయలలిత పాత్రలో కనిపిస్తారట.