బాహుబలి డైలాగ్‌ అదరగొట్టిన డేవిడ్ వార్నర్


ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌ వీడియోతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ మధ్యే బుట్టబొమ్మ అంటూ ఫ్యామిలీతో కలిసి డాన్సులు చేశాడు. ఈయన చేసిన పాటకు అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. సూపర్ డేవిడ్ అంటూ అందరు ఆయన్ని పొగడ్తలో ముంచెత్తారు. ఆ తర్వాత కమల్ హాసన్ పాటకు కూడా స్టెప్పులేశాడు. ఆపై మహేష్ బాబు ‘పోకిరి’ డైలాగ్‌.. చెప్పాడు. దక్షిణాది ప్రేక్షకులు డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలకు ఫిదా అవుతున్నారు. పూరీ జగన్నాథ్ మాత్రం వార్నర్ నటనకు ప్లాట్ అయి తన సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేయాలని కోరాడు. దీనికి డేవిడ్ కూడా ప్రయత్నించాను సర్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత రాములో రాములో పాటకు డాన్సులు చేశాడు.

తాజాగా ఈ క్రికెటర్.. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాలోని అమరేంద్ర బాహుబలి అనే నేను డైలాగ్‌ను టిక్‌టాక్ వీడియోగా చేసి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో డేవిడ్ వార్నర్ ఇపుడు టిక్‌టాక్‌తో టైమ్ పాస్ చేస్తున్నాడు.

View this post on Instagram

Guess the movie!! @sunrisershyd

A post shared by David Warner (@davidwarner31) on