HomeTelugu Big Storiesపవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటిస్తున్నా: రానా

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటిస్తున్నా: రానా

Ranas reaction on ayyappan
టాలీవుడ్‌ యంగ్‌ హీరో దగ్గుబాటి రానా పెళ్లి తరువాత ఫుల్‌ స్వీడ్‌లో ఉన్నాడు. ఆయన నటించిన అరణ్య సినిమా విడుదలకు రెడీగా ఉంది. అదే విధంగా విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, నందితా దాస్‌, ప్రియమణి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా రానాకు సంబంధించిన మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కోలీవుడ్‌ సూపర్‌హిట్‌ సాధించిన అయ్యప్పన్‌ కొషియమ్’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం రానాను సంప్రదించినట్లు వినికిడి. అందులో బిజు మేనన్‌ పోషించిన పాత్రలో పవన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తాజాగా ఈ వార్తలపై రానా స్పందించాడు. తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. ‘అవును ఈ సినిమాలోని పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఈ సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉంది’ అని తెలిపారు. అదే విధంగా బాబాయి వెంకటేష్‌, రానా కలయికలో ఓ సినిమా రూపొందుతున్నట్లు వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. వెంకటేష్‌తో కలిసి సినిమా చేయనున్నటు క్లారిటీ ఇచ్చాడు. బాబాయ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని చాలా కాలం నుంచి వేచి చూస్తున్నట్లు తెలిపారు. సరైన కథ దొరికిందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఏడాదిలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. అంతేగాక ఇటీవల బాబాయి అరణ్య సినిమా బిట్స్‌ చూశారని, మొదటి సారి బాగుందని మెచ్చుకున్నారని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu