‘దసరా’ నానిని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెడుతుందా?

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రూపొందిన చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో కీర్తిసురేష్‌, దీక్షిత్ శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. నాని- కీర్తి సురేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా పలకరించనున్న ఈ సినిమాలో, నాని లుక్‌పై మొదటి నుండి ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా మార్చి 30 న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ధరణిగా నాని .. వెన్నెలగా కీర్తి సురేశ్ పాత్రలను పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ మొదలవుతుంది. కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది. ఇక ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్‌, ఫైట్స్‌ ఆకట్టుకున్నాయి. హీరో, హీరోయిన్లు పూర్తి స్థాయిలో డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమాతో నాని పాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడు అని ఫ్యాన్స్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌ కూడా ఈ సినిమా మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. నాని ఇటువంటి ఊర మాస్‌ పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఫ్యామిలీ డ్రామాస్‌ చేసిన నాని ఈసారి కొత్తగా ట్రై చేశాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇది నానికి ఎంత వరకు ప్లస్‌ అవుతుందో చూడాలి. తెలంగాణ గోదావరిఖని నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates