‘జున్ను’ ఇదేం టైటిల్ అఖిల్!

అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమా మొదలుకానుంది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ జున్ను అనే ప్రచారం మొదలైంది. విక్రమ్ సినిమాలు కొత్తగా ఉంటాయి. కాబట్టి సినిమాకు జున్ను అనే టైటిల్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వచ్చే నెల నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాలో అఖిల్ పాత్ర పేరు జున్ను అని సినిమాలో అందరూ తనను అలానే పిలుస్తారని అందుకే ఇదే టైటిల్ ఆ ఫిక్స్ చేశారని చెబుతున్నారు. రెండో సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని భారీ రేంజ్ లో అఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం హాలీవుడ్ నుండి యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రఫీ చేయడానికి టెక్నీషియన్స్ ను కూడా పిలిపించాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ జున్ను అనే టైటిల్ మాత్రం ఎక్కడో.. కొడుతుంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలి!