HomeTelugu Trendingరీల్‌ కపిల్‌ దేవ్‌తో రియల్‌ కపిల్‌ దేవ్‌

రీల్‌ కపిల్‌ దేవ్‌తో రియల్‌ కపిల్‌ దేవ్‌

3 5టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ’83’. ఈ సినిమాలో రీల్‌ లైఫ్‌ కపిల్‌ దేవ్‌గా బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. ఈ రోజు రణ్‌వీర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా కపిల్‌ దేవ్‌గా తన ఫస్ట్‌లుక్‌ను రణ్‌వీర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ‘నాకు ఎంతో ప్రత్యేకమైన రోజున హరియాణా హరికేన్‌ కపిల్‌దేవ్‌ను పరిచయం చేస్తున్నా’ అని రణ్‌వీర్‌ ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ఫొటోలో బంతిని ఎగరేస్తూ రణ్‌వీర్‌ లుక్‌ ఎంతో ఆకట్టుకుంది.

కొద్ది గంటల్లోనే ఈ ఫొటోకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఫొటో పోస్టు చేసిన రెండు గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది లైక్‌ చేశారు. టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ స్పందిస్తూ.. ‘అచ్చం పాజీ(కపిల్‌ దేవ్‌)లాగే ఉన్నావ్‌. హ్యాపీ బర్త్‌డే బ్రో’ అని కామెంట్‌ చేశారు. బాలీవుడ్‌ నటులు అయుష్మాన్‌ ఖురానా, అహానా కుమ్రా, సన్య మల్హాత్రా తదితరులు కూడా రణ్‌వీర్‌ లుక్‌ను మెచ్చుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu