HomeTelugu Trendingస్టైలిష్‌ లుక్‌ లో అదిరగొట్టిన సూర్య

స్టైలిష్‌ లుక్‌ లో అదిరగొట్టిన సూర్య

Surya new look viral

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. తెలుగులోనూ సూర్యకు మంచి క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శివకుమార్ డైరెక్షన్‌లో కంగువ సినిమా చేస్తున్నాడు.

ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు దీనిని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న జూన్ 16న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తన పార్ట్ షూట్ మొత్తం కాంప్లీట్‌ చేసున్న సూర్య ప్రస్తుతం చిల్‌ అవుతున్నాడు. ఇటీవలే జ్యోతిక ఓ వీడియో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలో సూర్య న్యూలుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా కంగువ పోస్ట్ ఫోటోషూట్ లో భాగంగా సూర్య దిగిన స్టైలిష్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu