
Ranveer Singh and Deepika Padukone Combined Net Worth:
రన్వీర్ సింగ్ – దీపికా పదుకొణే జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైలిష్ లైఫ్‌స్టైల్, లగ్జరీ హౌసెస్‌తో వారి జీవితం నిజంగా రాయల్టీలా ఉంటుంది. ఈ జంట కలిపి రూ.800 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉంది. దీపికా రూ.500 కోట్లు, రన్వీర్ సింగ్ రూ.300 కోట్లు సంపాదించారట! వారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓసారి స్క్రోల్ చేస్తేనే తెలుస్తుంది ఎంత రిచ్‌గా జీవిస్తున్నారో.
ఇప్పుడు వారి దగ్గరున్న 4 ముఖ్యమైన లగ్జరీ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం…
1. బాంద్రా సముద్రపు వ్యూ క్వాడ్రుప్లెక్స్
ఈ ప్రాపర్టీ తాజాగా వారు కొనుగోలు చేసినది. షారుక్ ఖాన్ మన్నత్ పక్కన ఉన్న ఈ 4 అంతస్థుల అపార్ట్‌మెంట్ ధర రూ.119 కోట్లు. 11,266 చదరపు అడుగుల ఇంటీరియర్ స్పేస్‌తో పాటు, 1,300 చదరపు అడుగుల టెర్రస్ కూడా ఉంది.
2. అదే బిల్డింగ్‌లో మరో అపార్ట్‌మెంట్
ఈ బిల్డింగ్‌లోనే వారు మరో ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ.17.8 కోట్లు.
3. అలిబాగ్ హాలిడే బంగ్లా
2021లో వారు అలిబాగ్‌లోని మాప్గావ్ విలేజ్‌లో “బిలియనీర్స్ స్ట్రీట్”లో 2.25 ఎకరాల్లో ఉన్న బంగ్లాను కొనుగోలు చేశారు. దీని ధర రూ.22 కోట్లు. 18,000 చదరపు అడుగుల ఈ బంగ్లా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది.
4. బియుమాండ్ టవర్స్, ముంబయిలో హోమ్
వివాహం తర్వాత వారు వొర్లీలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండటం మొదలుపెట్టారు. దీని విలువ రూ.42 కోట్లు. క్లాసీ ఇంటీరియర్స్‌తో పాటు పాస్టెల్ షేడ్స్, ఆర్టిస్టిక్ టచ్ దీనికి ప్రత్యేకత.
సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన “రామ్‌లీలా” సెట్స్‌లో మొదలైన ఈ ప్రేమకథ 2018లో పెళ్లితో ముగిసింది. 2024లో వీరి కూతురు “దువా” జన్మించింది.













