HomeTelugu Trendingరామ్‌-లింగుస్వామి మూవీ అప్డేట్‌

రామ్‌-లింగుస్వామి మూవీ అప్డేట్‌

Ram 19th movie update

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ పోతినేని తన తర్వాతి సినిమాను కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చాడు. జూలై 12 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందట. చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభంచవాల్సింది. అయితే.. కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. మరోవైపు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రావడంతో సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu