మహర్షి విజయోత్సవ వేడుక వాయిదా

ప్రముఖ నటి విజయ నిర్మల కన్నుమూయడంతో మహర్షి సినిమా విజయోత్సవ వేడుకను వాయిదా వేశారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు 25వ సినిమా మహర్షి. ఈ సినిమా ఇవాళ్టితో 50 రోజులు పూర్తిచేసుకుంటుంది. రేపు విజయోత్సవ వేడుకను మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరిపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల కన్నుమూయడంతో ఈ వేడుకను వాయిదా వేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. జూన్‌ 28న 50 రోజుల విజయోత్సవ వేడుకను ఈక్రమంలో.. విజయ నిర్మల బుధవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించడంతో వేడుకను వాయిదా వేశారు. అయితే వేడుకను ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.