అందుకు సిద్ధంగా లేను: విజయ్ దేవరకొండ


‘అర్జున్‌రెడ్డి’, ‘గీతగోవిందం’ సినిమాలతో అమ్మాయిల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్‌, ఇజబెల్లె లైట్‌, కేథరిన్‌లు హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ప్రమోషన్స్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెళ్లి, ప్లాన్స్‌ గురించి విజయ్‌ని వ్యాఖ్యాత ప్రశ్నించగా.. తాను ప్రస్తుతం పెళ్లి చేసుకోడానికి సిద్ధంగాలేనని తెలిపారు. ‘వివాహబంధంపై నాకెంతో గౌరవం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం అందుకు నేను సిద్ధంగా లేనని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా కెరీర్‌ను ప్రేమిస్తున్నాను. జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటున్నాను’ అని ఆయన తెలిపారు.