HomeTelugu Trendingఎన్టీఆర్‌ సినిమాలో రష్మిక!

ఎన్టీఆర్‌ సినిమాలో రష్మిక!

Rashmika in NTR movie

కన్నడ బ్యూటీ రష్మిక వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో తాజాగా ‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లోను వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించింది. ఆయా భాషల్లో రష్మిక కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అయిందనే విషయం అర్థమవుతోంది.

Rashmika2

తమిళ .. హిందీ సినిమాల నుంచి ఆమెకి అవకాశాలు పెరిగినట్టుగా చెబుతున్నారు. విజయ్ తదుపరి సినిమాలో ఆమెనే హీరోయిన్ అంటున్నారు. ఇక తెలుగులో ఆమె ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో హీరోయిన్‌ ప్రధానమైన సినిమా కూడా ఒకటి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమాకి గాను ఆమె పేరు తెరపైకి వచ్చింది.

Rashmika1

కొరటాల డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వాని, జాన్వీ కపూర్, అలియా భట్ పేర్లు వినిపించాయి. తాజాగా తెరపైకి రష్మిక పేరు వచ్చింది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu