HomeTelugu Trendingమాజీ లవర్‌తో సినిమాకు రెడీ అంటున్న రష్మిక

మాజీ లవర్‌తో సినిమాకు రెడీ అంటున్న రష్మిక

6 12
టాలీవుడ్‌లో బీజీగా ఉన్న హీరోయిన్‌ల్లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఒకరు. తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలకు జంటగా వరుస ఆఫర్‌లతో దూసుకుపోతుంది. తెలుగు ఇండస్ట్రీలోకి రాకముందు కన్నడ చిత్రాలలో రష్మిక నటించింది. కన్నడలో ‘కిరాక్ పార్టీ’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా చేసే సమయంలోనే ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. నిశ్చితార్థం వరకు వెళ్లింది కాగా కొన్ని రోజుల్లో పెళ్లి అనే టైంలో ఏం జరిగిందో కానీ… ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా… ఎవరి పనుల్లో వారు బీజీ అయిపోయారు.

ఇప్పుడు తాజాగా ‘కిరాక్ పార్టీ’ సినిమాకు సీక్వెల్ తీసేందుకు రక్షిత్ శెట్టి రెడీ అయ్యాడు. వేరే హీరోయిన్ ను తీసుకోవాలని రక్షిత్ భావిస్తున్నాడు. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ విషయం రష్మికకు తెలియడంతో.. రక్షిత్ తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. దీంతో, రష్మికతో కలిసి పని చేసేందుకు రక్షిత్ ను ఒప్పించే పనిలో పడ్డారట నిర్మాతలు. మరి రక్షిత్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu