‘తెల్లవారితే గురువారం’ ఫస్ట్‌లుక్‌


‘మత్తువదలరా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి వారసుడు శ్రీసింహా కోడూరి. టిఫికల్ స్టోరీలో డెలివరీ బోయ్ పాత్రలో సింహా నటన ఆకట్టుకుంది. ప్రస్తుతం అతడు నటిస్తున్న రెండో సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మరోసారి ఓ విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకుని ఆసక్తికర పాత్రలో నటిస్తున్నాడని తాజాగా రిలీజైన టైటిల్ పోస్టర్ చెబుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. మణికాంత్ జెల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘తెల్లవారితే గురువారం’ అని టైటిల్ ని ప్రకటించారు. రవీంద్ర బెనర్జీ ముప్పనేని – రజిని కొర్రపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 మార్చిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో చిత్ర శుక్లా- మిషా నారంగ్ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. హీరో అన్నయ్య సోదరుడు కాల భైరవ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు.

‘నారప్ప’ న్యూలుక్‌

వకీల్‌సాబ్‌ ‘టీజర్‌’

CLICK HERE!! For the aha Latest Updates