HomeTelugu Newsఆ చిత్రం కోసం రష్మిక జుట్టు కత్తిరించుకుందట..!

ఆ చిత్రం కోసం రష్మిక జుట్టు కత్తిరించుకుందట..!

1 8పాత్ర కోసం ప్రాణం పెట్టే వాళ్లు కొందరుంటే, మేకోవర్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే వాళ్లు మరికొందరుంటారు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ చిత్రం కోసం సెన్సేషనల్ హీరోయిన్‌ రష్మిక తన అందమైన వాలు జడను పొట్టిగా కత్తిరించుకుని హాట్ టాపిక్ అయింది. విజయ్‌దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక క్రికెటర్‌గా నటిస్తోంది. ఛలో, గీత గోవిందం సినిమాలతో తెలగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుందీ రష్మిక.

దేవదాస్ సినిమాలో కాస్త నిరాశ కలిగించినా.. రష్మికకు డియర్ కామ్రేడ్ వంటి క్రేజీ ప్రాజెక్టు ప్రస్తుతం లైన్‌లో ఉంది. గీత గోవిందం సినిమాలో హీరో, హీరోయిన్‌లుగా నటించిన విజయ్, రష్మిక జంట మరోసారి కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి భారీగా ఉంది. మరోవైపు ఈ చిత్రంలో రష్మిక క్రికెటర్‌గా నటించడం మరో విశేషం. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం జుట్టును త్యాగం చేసిందీ రష్మిక. డియర్‌ కామ్రేడ్ చిత్రంలో రష్మిక పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్‌ చేశాడట దర్శకుడు భరత్ కమ్మ. క్రికెటర్‌గా నటిస్తున్న తన పాత్రలో రియాల్టీ కోసం క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకుందట రష్మిక.

Recent Articles English

Gallery

Recent Articles Telugu