రష్మీక మందనా హాట్‌ ఫోటోలు

టాలీవుడ్‌ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న నటి రష్మిక మందన్న. గతేడాది నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ వెంటనే విజయ్ దేవరకొండతో నటించిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో దెబ్బకు స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. విజయ్ దేవరకొండతో నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమా జులై 26న విడుద‌ల కానుంది. ఈ సినిమాతో పాటు మ‌హేష్ బాబు సినిమాలో కూడా న‌టిస్తుంది ర‌ష్మిక‌. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో నెంబ‌ర్ వ‌న్ కావాల‌ని చూస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా హాట్ ఫోటోషూట్ ఒక‌టి చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఓ వైపు వ‌రస అవ‌కాశాలు వ‌స్తున్నా కూడా మ‌రోవైపు అందాల ఆర‌బోత‌లో మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు ఈ క‌న్న‌డ బ్యూటీ. ఇప్పుడు విడుద‌లైన ఫోటోషూట్‌లో ష‌ర్ట్ బ‌ట‌న్ విప్పేసి రెచ్చగొడుతుంది ర‌ష్మిక మంద‌న్న‌.

ఈ ఫోటోల‌ను ఇప్పుడు ఈ భామ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిని చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. వామ్మో ఏందీ హాట్ నెస్ అంటూ నోరెళ్ల‌బెట్టుకుంటున్నారు అభిమానులు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఈ గ్లామ‌ర్ షోకు ప‌డిపోతున్నారు. సినిమాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటే లెక్క స‌రిపోతుంద‌ని ప్లాన్ చేసుకుంటుంది ర‌ష్మిక‌.