తెలుగులో తమన్నాకి నో ఛాన్స్!

తెలుగులో అగ్ర కథానాయికగా వెలుగొందిన తమన్నాకి కొంత కాలంగా ఇక్కడ ఛాన్సులు లేవనే చెప్పాలి. దీంతో అమ్మడు దృష్టి కోలీవుడ్ పై పడింది. అక్కడ ఓ మూడు ప్రాజెక్ట్స్ వరకు లైన్ లో పెట్టింది. తెలుగులో మాత్రం బాహుబలి2 తరువాత అమ్మడు చేతిలో ఒక్క అవకాశం కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత బాగానే ఉంది. ఈ మధ్య మరీ ఎక్కువైంది.

యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరి నుండి కూడా తమన్నాకు ఫోన్ రాలేదు. ఆమెను సంప్రదించే దర్శకనిర్మాతల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరూ సమంత, రకుల్ వంటి హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆఖరికి అను ఎమ్మాన్యూయల్, నివేద థామస్ వంటి కొత్త తారాలకు సైతం అవకాశాలు దొరుకుతున్నాయి. కానీ మిల్కీ బ్యూటీ పరిస్థితి మాత్రం ఒకరకంగా ప్రశ్నార్ధకంగా మారింది!