HomeTelugu Newsబన్నీ తరువాత ఎన్టీఆర్‌తో రష్మిక?

బన్నీ తరువాత ఎన్టీఆర్‌తో రష్మిక?

13 7
టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లు పూజా హెగ్డే, రష్మిక మందన్న. ఈ ఇద్దరూ వరస ఆఫర్లతో రెచ్చిపోతున్నారు. ప్రతీ హీరో, దర్శకుడు ఈ ఇద్దరిపై ఎక్కువ ఇంట్రెస్‌ట్‌ చూపిస్తున్నారు. ఇద్దరు నెంబర్ వన్ ప్లేస్ కోసం చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రష్మిక మందన్న వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో తొలిసారి పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేసింది రష్మిక. ఈ చిత్రంలో డాన్సులతో పాటు కామెడీ కూడా బాగానే చేసింది.

అప్పట్లో దూకుడు సినిమా ఎలాగైతే సమంతకు బ్రేక్ ఇచ్చిందో.. ఇప్పుడు రష్మికకు కూడా సరిలేరు నీకెవ్వరు అలాగే బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఈ చిత్రం తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాలు ఈమె ముందు క్యూ కడుతున్నాయి. ఇదే జోరు చూపిస్తే కచ్చితంగా త్వరలోనే ఈమె నెంబర్ వన్ కావడం ఖాయం. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా ఖరారైంది రష్మిక. అందులో అల్లు అర్జున్, సుకుమార్ సినిమా కూడా ఉంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ చిత్రంలో రంగస్థలంలో సినిమాలో సమంత నటించిన తరహా పాత్రలో రష్మిక కనిపించబోతుంది .

తాజాగా మరో ఆఫర్ రష్మిక ముందుకు వచ్చేసింది. అదే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్‌. ఈ చిత్రంలో రష్మికనే హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu