HomeTelugu Newsఈవారం థియేటర్‌ల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

ఈవారం థియేటర్‌ల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

These movies will release oఈవారం థియేటర్‌ల్లో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ సారి శివరాత్రి కూడా కలిసి రావడంతో ఆ సందడి మరింత ఎక్కువగా ఉండనుంది. ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు..

భీమా: గోపీచంద్‌ హీరోగా కన్నడ డైరెక్టర్ ఎ. హర్ష తెరకెక్కించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్‌ మూవీ ‘భీమా’ మార్చి 8న ఈ సినిమా రిలీజ్​ కానుంది. గోపీచంద్‌ ద్విపాత్రభినయం చేస్తున్నాడు. ఒక పాత్రలో పోలీసుగా మరో విభిన్న పాత్రలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ఓరెంజ్‌లో అంచనాలను క్రియేట్‌ చేసింది.

గామి: విశ్వక్‌ సేన్‌ లీడ్​ రోల్​లో వస్తున్న అడ్వెంచర్‌ డ్రామా ‘గామి’. ఈ సినిమాలో విశ్వక్‌ అఘోరగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్‌ హలీవుడ్‌ రెంజ్‌లో ఉంది అని ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ ట్రైలర్‌ మూవీపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేసింది. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

ప్రేమలు: ఇటీవలే మలయాళంలో సూపర్ హిట్​ టాక్ అందుకున్న ‘ప్రేమలు’ మూవీ ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇదిలా ఉండగా, అజయ్‌ దేవగణ్‌ ‘షైతాన్‌’, ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘రికార్డ్‌ బ్రేక్‌’ మూవీ కూడా ఇదే రోజున రిలీజయ్యేందుకు రెడీగా ఉంది. వీటితో పాటు ‘లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’, ‘రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’, మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!