HomeTelugu Trendingకరోనా ఎఫెక్ట్‌ మాస్క్ ధరించిన ప్రభాస్‌

కరోనా ఎఫెక్ట్‌ మాస్క్ ధరించిన ప్రభాస్‌

4 3
చైనాలో ప్రాణంపోసుకొని ప్రపంచమంతా పాకుతుంది కరోనా వైరస్. ఇప్పటికే దాదాపు 65 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. పలు దేశాల్లో ఈ మహమ్మారి బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా కరోనా కేసులు నమోదు కావడం కలవరపరుస్తోంది. దీంతో జనాలు ముందస్తు చర్యల్లో భాగంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు.

ఈ నేపధ్యంలో టాలీవుడ్ యంగ్‌ రెబల్‌స్టార్ హీరో ప్రభాస్ కూడా మాస్క్ ధరించి కనిపించాడు. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న సమయంలో మాస్క్ ధరించాడు. చాలా వేగంగా నడుస్తూ కనిపించాడు. ప్రభాస్ ప్రస్తుతం సినిమా జాన్ షూటింగ్ కోసం యూరప్ వెళ్తూ ఇలా మాస్క్ తో దర్శనమిచ్చాడు. ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు మాస్కులు ధరించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని పలువురు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu