HomeTelugu Trendingఆర్యన్ ఖాన్‌కు రవీనా టాండన్ మద్దతు

ఆర్యన్ ఖాన్‌కు రవీనా టాండన్ మద్దతు

Raveena Tandon supports to

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని పోలీసు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. క్రూయిజ్‌లో రేవ్ పార్టీ జరిగిన సమయంలో 1000మందికి పైగా ఉన్నప్పటికి 8 మందిని మాత్రమే ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్యన్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించారని బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆరోపిస్తున్నారు. ముంద్రా పోర్టులో చిక్కిన వేల కోట్ల హెరాయిన్ కేసును దారి మళ్లించడానికే పోలీసులు ఆ విధంగా చేస్తున్నారంటున్నారు. ఇప్పటికే ఆర్యన్‌కు సునీల్ శెట్టి, హృతిక్ రోషన్ అండగా నిలిచారు. తాజాగా ఈ జాబితాలోకి మరొకరు చేరారు.

ఆర్యన్‌ను అనుచితంగా అరెస్టు చేశారని బాలీవుడ్ అలనాటి తార రవీనా టండన్ ఆరోపిస్తున్నారు. అతడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎవరి పేరును ప్రస్తావించకుండగానే ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను పెట్టారు. సిగ్గులేని రాజకీయాల వల్ల ఒక యువకుడి జీవితం, భవిష్యత్తు నాశనం అవుతోంది అంటూ పోస్టు చేశారు. గతంలో షారూఖ్, రవీనా టాండన్ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రవీనా టండన్ కేజీఫ్ చాప్టర్-2 చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాలో రమిక సేన్ పాత్రలో ఆమె కనిపించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu