HomeTelugu Trendingరవిబాబు 'ఆవిరి'

రవిబాబు ‘ఆవిరి’

7 8రవిబాబు.. నటుడిగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించడమే కాకుండా.. దర్శకుడిగా కుడా విభిన్నమైన చిత్రాలనే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఆయన తన సినిమాల టైటిల్ ‘అ’ అనే అక్షరంతో మొదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. అలా ఆ మధ్య ‘అదుగో’ అనే సినిమాతో కొత్త ప్రయోగం చేసిన ఆయన, తాజాగా ‘ఆవిరి’ అనే సినిమా చేశాడు.

ఈ హారర్ థ్రిల్లర్ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలాడు. గ్యాస్ స్టవ్ పై ఉన్న కుక్కర్ నుంచి ఆవిరి వస్తుండగా, కుక్కర్ పై భాగాన్ని ఓపెన్ చేసుకుని అందులో నుంచి భయపెడుతూ రెండు కళ్లు కనిపించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ‘ఆవిరి’ అనే టైటిల్ కి తగినట్టుగా వదిలిన ఈ ఫస్టులుక్ పోస్టర్ ఆసక్తిని కలిగించేలా వుంది. అంతా కొత్త వారితో రవిబాబు నిర్మించిన ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. గతంలో ‘అవును’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు రవిబాబు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu