రొమాంటిక్ డ్రామాతో రవిబాబు!

విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రవిబాబు. నటుడిగా కూడా తన పాత్రలు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు. రవిబాబు సినిమాలకు సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రూపొందిస్తోన్న ‘అదిగో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతోంది. ఈ సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తూనే తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు ఈ డైరెక్టర్. ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ కూతురు స్వప్న దత్ ఓ సినిమాను నిర్మించబోతుంది.

ఈ సినిమాకు దర్శకుడిగా రవిబాబు వ్యవహరించనున్నాడు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎన్నుకునే పనిలో పడ్డాడు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!