HomeTelugu Trendingచిరంజీవి సినిమా కోసం రవితేజ భారీ పారితోషికం

చిరంజీవి సినిమా కోసం రవితేజ భారీ పారితోషికం

Ravi Teja 7 crore remunerat

మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడట. గతంలో చిరంజీవితో ‘అన్నయ్య’సినిమాలో ఆయన తమ్ముడుగా నటించాడు రవితేజ. ఇక రవితేజ ‘డాన్ శ్రీను’కి స్క్రీన్ ప్లే, ‘బలుపు’ కి కథ అందించిన కె.యస్. రవీంద్ర అలియాస్ బాబీ రవితేజ ‘పవర్’ సినిమాతోనే దర్శకుడుగా మారాడు. ఇప్పుడు చిరంజీవితోనూ, దర్శకుడు బాబీతోనూ ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ లో చిరు సన్నిహితుడి పాత్రలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ పాత్ర కోసం మాస్ మహారాజా 7 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రామారావు అన్ డ్యూటీ, ధమాకా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu