HomeTelugu Trendingరవితేజ 70 వ చిత్రం ప్రకటన

రవితేజ 70 వ చిత్రం ప్రకటన

Ravi Teja 70th Movie announ

మాస్ మహారాజ రవితేజ 70వ చిత్రాన్ని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగోను నవంబర్ 5న ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నారు. “హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్”అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రకటన రవితేజ 70వ సినిమాను ప్రకటించారు. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న పురాతన ఆలయ శిల్పాలు సినిమాపై ఉత్సుకతను పెంచుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సిననిమాకి ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ తో పాటు రవితేజ ఆర్టి టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా పవర్‌ఫుల్ కథను అందించారు. నటీనటులు తదితర వివరాలు నవంబర్ 5న విడుదల కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu