HomeTelugu Trendingపార్టీలో స్టెప్పులేసిన నివేదా థామస్.. వీడియో వైరల్‌

పార్టీలో స్టెప్పులేసిన నివేదా థామస్.. వీడియో వైరల్‌

13 5
జెంటిల్‌మెన్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దు గుమ్మ నివేదా థామస్.. నిన్నుకోరి, జై లవకుశలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ మధ్య చదువు కోసం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. ‘జై లవకుశ’ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఈ మధ్యే కళ్యాణ్ రామ్ గుహన్ సినిమా.. నిఖిల్ “శ్వాస” సినిమాలు ఒప్పుకుంది.

సినిమాలతో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ టైమ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నివేదా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్‌చేశారు. తనకు ఏమాత్రం సమయం దొరికినా తన కుటుంబంతో గడపడం అంటే చాలా ఇష్టం అనే నివేదా థామస్… తన సోదరులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటుంది.

తాజాగా తన సోదరులతో కలసి ఓ వివాహ వేడుకలో నివేదా ఈ డ్యాన్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ప్రభుదేవా హీరోగా వచ్చిన గులేభకావలి సినిమాలోని సాంగ్‌కు స్టెప్పులేసింది ఈ హీరోయిన్‌. ఆ డ్యాన్స్ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ .. ‘మీరు పార్టీని ఎలా ఎంజాయ్‌ చేస్తారు?.. మీ హీల్స్‌ను విసిరేయండి..వెళ్లి డ్యాన్స్‌చేయండి’ అనే కామెంట్ కూడా పెట్టింది . ప్రస్తుతం నివేదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu